Posts

Image
ప్రకృతి వ్యవసాయంలో కషాయాలు, ద్రావణాలు కీలకపాత్రవహిస్తాయి. వాటిలో జీవామృతం ఒకటి. ఇది అనంతకోటి సూక్ష్మ జీవుల తో కూడిన మహాసాగరం . జీవామృతం ద్వారా భూమిలో సూక్ష్మజీవులు , వానపాములు ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందుతాయి . మట్టిలో నిద్రావస్థలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములను చెతన్య వంతం చేయడం ద్వారా జీవామృతం భూసారం పెరగడానికి దోహదపడుతుంది .ఈ సూక్ష్మజీవులు భూమిలో మొక్కల వేర్లు పోషకాలను వినియోగించుకునే రీతిలోకి అందుబాటులోకి తెస్తాయి బెట్టా (నీటి ఎద్దడి) తట్టుకోవడానికి జీవామృతం రైతులకు ఎంతో సహాయ పడుతుంది అని చెబుతారు. జీవామృతం వాడడం వలన పంటల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాము. జీవామృతం తయారీ ఇలా.. కావలసిన పదార్థాలు: 200 లీటర్లు నీళ్లు, 10 కిలోలు ఆవుపేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కిలోలు శనగ/మినుము పిండి, 2 కిలోలు బెల్లం, పిడికెడు పొలం గట్టు మట్టి. ఈ పదార్థాలను ఒక డ్రమ్ములో 48 గంటలు నానబెట్టాలి. రోజుకు మూడు సార్లు ద్రావణాన్ని కలియతిప్పాలి. నీమాస్త్రం: 100 లీటర్ల నీళ్లు, కిలో ఆవు పేడ, 5 లీటర్లు ఆవు మూత్రం, 5 కిలోలు వేప పొడి, వేపాకు గుజ్జును 24 గంటలు నీటిలో నానబెట్టి రోజుకు మూ
మేము ప్రకృతి వ్యవసాయం ఎంచుకొని అర్ధ ఎకరంలో రాణికంద, జిలకర సాంబ మరియూ రత్నచోడి అనే దేశవళిరకం వరి పండించాలి ఎన్నుకోడం జరిగింది. అన్నుకొనదే  తరువాయిగా మొదలు పెట్టాం కేవలం జీవమూత్రం 3 సార్లు, దశపర్ణి కాషాయం 1 సారి, నీమాస్త్రం 1 సారి, సి ఆర్ పద్దతిలో మట్టి ద్రావణం 2సార్లు పిచికారీ చేసాం. కానీ మేము ఎంచుకున్న పొలం మొదటిసారి అందులో ఇసక నేల కావడంతో అనుకునంత దిగుబడి తీయలేకపోయాం, కేవలం రకానికి 70 కిలొగ్రామ్  చొపున 2కింటాలు మాత్రమే సాదించగలిగాం